calender_icon.png 6 March, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించిన సండ్రుగు శ్రీకాంత్

06-03-2025 07:54:18 PM

మండలంలో ఔదార్యం చాటుతున్న యువ నాయకుడు..

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణానికి చెందిన ఓ నిరుపేద వధువు పుల్లబోయిన ఎల్లం, అనితల కూతురు ప్రవళిక వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలో ఉంటున్న నిరుపేద కుటుంబం అయిన వధువు ప్రవళిక, వివాహానికి గాను పట్టణానికి చెందిన దాత సండ్రుగు శ్రీకాంత్ క్వింటల్ బియ్యాన్ని, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... మండలంలో ఏ గ్రామంలో అయినా ఆడపిల్ల ఉంటే వారికి తనకు తోచిన సాయంగా పుస్తె మట్టెలు, బియ్యం నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సండ్రుగు రాజు, తిరుపతి, ప్రశాంత్, సాయికుమార్, శ్రీమాన్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.