calender_icon.png 7 March, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 ఫలితాలలో సాందీపని విద్యార్థుల ప్రభంజనం

05-03-2025 08:44:16 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 ఫలితాలలో సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాలలో MSTCS మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 విభాగంలో రిమ్ష మహీన్ 10 కి 10 SGPA, NZC మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 విభాగంలో మ్యాదరి స్నేహ 10కి 10 SGPA, అఫీరా మాలిక్ 10కి గాను 9.84 SGPA, BCom తృతీయ సంవత్సరం సెమిస్టర్-5 విభాగంలో 10కి గాను 9.72 SGPA మార్కులను సాధించారు. యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంకును సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ఆర్. హరిస్మరణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు, అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, ఉపన్యాసకులు, విద్యార్థులను అభినందించారు.