calender_icon.png 6 January, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు: రేవతి భర్త

13-12-2024 04:48:00 PM

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ అరెస్టుపై సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని తెలిపాడు. అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదన్న ఆయన అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానని స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని పోలీసులను మీడియా సమక్షంలో కోరాడు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించిన విషయం తెలిసిందే.