calender_icon.png 20 April, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులలో 25 సీట్లు సాధించిన సాందీప పాఠశాల

14-04-2025 01:07:47 AM

చిన్న చింతకుంట ఏప్రిల్ 13 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాలలో మండల కేంద్రంలోని సాందీప ప్రాథమిక పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థులు గురుకులకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కాంతయ్య, ప్రిన్సిపాల్ కృష్ణయ్య తెలిపారు.

4వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులు గురుకులం లో ఐదో తరగతి ప్రవేశానికి ఫిబ్రవరి 23 న గురుకులలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో పాల్గొని మంచి మార్కులు సాధించా రు. ఈ నెల 6 న విడుదలైన ఫలితాల్లో గురుకుల పాఠశాలకు 25 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వివరించారు. ఈ సందర్భంగా 25 మంది విద్యార్థులను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ తో పాటు గ్రామస్థులు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు.

భవిష్యత్లోనూ మంచి ఫలితాలు సా ధించి చదువుకున్న పాఠశాలకు , తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సాధించిపె ట్టాలని ఉపాధ్యాయులు కోరారు. 25 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపిక కావడానికి ఎంతో కృషిచేసిన పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయ బృందా న్ని పలువురు అభినందించారు. ఉపాధ్యాయులు సుధాకర్, నవీన్, రేవతి,రాగిణి, కవిత, పాతిమా, శ్రీలత, దీన, స్వర్ణలత, మేఘన తదితరులు ఉన్నారు.