calender_icon.png 16 January, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందీప్‌వి మోసపూరిత సమాధానాలె

17-09-2024 04:07:27 AM

పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన సీబీఐ

కోల్‌కతా:  కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు విచారణలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్  సందీప్ ఘోష్ మోసపూరిత సమాధానాలిచ్చినట్లు సీబీఐ తెలిపింది. విచారణలో భాగంగా పాలీగ్రాఫ్ టెస్ట్, వాయిస్ అనాలిసిస్ నిర్వహించగా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పాలీగ్రాఫ్ టెస్ట్‌లో సందీప్ చెప్పిన సమాధానాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. దీంతో కేసుతో సంబంధమున్న ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నించవచ్చని అధికారులు వెల్లడించారు.

కాగా డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగస్టు 9న ఉదయమే సందీప్ ఘోష్‌కు సమాచారం అందినా వెం టనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీబీ ఐ పేర్కొంది. ఈ ఘటనలో సందీప్‌తో పాటు తాలా పీస్ ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌ను సీబీ ఐ అరెస్ట్ చేసి ఆదివారం స్థానిక కోర్టులో ఇ ద్దరిని ప్రవేశపెట్టిం ది. ఈ ఘటన అనంతరం ఇద్దరు ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారని, కేసులో ఎలా ముందుకెళ్లాలో అభిజిత్‌కు సందీప్ సూచించారని కోర్టులో సీబీఐ పేర్కొంది. వారిద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు దా న్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించింది.