16-02-2025 12:05:42 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బౌరం పేట్‌లో ఏర్పాటు చేస్తున్న 220 కేవీ సబ్‌స్టేషన్, మోనోపోల్స్ నిర్మాణ పనులను ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ..
హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత క్రమంలో 2025 ఫిబ్రవరి చివరి నాటికి సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.221.20 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్న ట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్ రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ టి. జగత్ రెడ్డి, సీఈ లు, ఎస్‌ఈలు, డీఈలు పాల్గొన్నారు.