కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీ కేసులో కోర్టుకు తెలిపిన సీబీఐ
కోల్‌కతా, సెప్టెంబర్ 15: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థి అత్యాచారం హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ డైరెక్షన్‌లోనే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగించారని కోర్టుకు సమర్పించిన కేసు దర్యాప్తు నివేదికలో సీబీఐ తెలిపింది.
ఈ కేసులో సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై సందీప్‌ఘోష్‌ను సీబీఐ శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు ఏ విధంగా చేయాలో పోలీసులకు సందీప్ ఘోష్ స్వయంగా చెప్పినట్లు కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది.