calender_icon.png 18 March, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీలు సమయపాలన పాటించాలి

14-03-2025 12:00:00 AM

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి

కాటారం, మార్చి 13 (విజయక్రాంతి) : క్వారీల నుండి నిత్యం వందల సం ఖ్యలో వస్తున్న ఇసుక లారీలు సమయపాలన పాటించేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాటారం ఎమ్మార్పీఎస్ మం డల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మా దిగ ఒక ప్రకటనలో కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాం తాల నుంచి కాటారం మీదుగా హ నుమకొండ, హైదరాబాద్ లాంటి పట్టణాలకు ఇసుక నిత్యం రవాణా జరుగుతోంది.

ఇసుక లారీలు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సమయపా లన లేకపోవడంతో లారీల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రాక పోకలు సాగిస్తున్నారని, తద్వార ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఇసుక లా రీల వల్ల  పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, మరల సాయంత్రం వేళల్లో ఇసుక లారీలు నడవకుండా ఉండేలా ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.