calender_icon.png 13 March, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దిరాల వాగు అడ్డాగా ఇసుక దందా

13-03-2025 12:46:15 AM

రాత్రివేళ పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో రవాణా                 

టేకులపల్లి, మార్చి 12 (విజయక్రాంతి): ZXఇసుక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ఇసుకాసురులు అడ్డదార్లు వెతుకుంటున్నారు. రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అడ్డదార్లలో రవాణాకు పూనుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇసుకాసురలది ఆడింది ఆటగా మారింది.

మండలంలో ముర్రేడు వాగు, తెల్లవాగు, కిన్నెరసాని తదితర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేస్తుండగా, అక్కడ అధికారుల నిఘా పెరగటంతో ,మద్దిరాల వాగు ప్రాంతాన్ని ఎన్నుకొని ఇసుక రవాణాకు పూనుకుంటున్నారు. మండలంలోని బద్దుతండా పంచాయతీ పరిధిలోని నంద్యాతండా - మద్దిరాలతండా గ్రామాల మధ్య మద్దిరాల వాగు ప్రవహిస్తుంది.

అక్కడ వందల ట్రాక్టర్ల ఇసుక ఉండటంపై అక్రమార్కులు కన్నేశారు. రాత్రివేళ ఇసుక తోడి ట్రాక్టర్లలో నింపి మద్దిరాలతండా మీదుగా, బేతంపూడి దర్గా, కోటల్ల మీదుగా తొమ్మిదోమైలుతండాకు చేరుకొని ఇల్లందు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడ్డుకట్ట వేసే అధికారులే ఇసుకాసురులతో చేతులు కలిపి జేబులు నింపుకుంటున్న ఆరోపణలు వస్తున్నాయి.

మంగళవారం రాత్రి ట్రాక్టర్లపై ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో ఓ అధికారి అక్కడికి వెళ్లి అడ్డగించడం ఒక డ్రైవర్ పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఆ వ్యక్తిపై కూలీలు, ట్రాక్టర్ల డ్రైవర్లు తిరగబడ్డట్టు తెలుస్తోంది. పట్టుకుంటే కేసు పెట్టండి, లేకుంటే ఏమి చేస్తారో చేయండి అంటూ తిరబడ్డట్టు తెలిసింది.

ఈ తతంగం అంత పూర్తయ్యేలోపు ట్రాక్టర్లలో లోడు చేసిన ఇసుకను అక్కడే డంప్ చేసి పరారైనట్లు తెలిసింది. కొందరు గుత్తేదార్లకు తీసుకెళ్లే ఇసుకను మాత్రం పోలీసులు, రెవిన్యూ, అటవీశాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని, వారికే అండగా ఉంటున్నారని చర్చించు కుంటున్నారు. రాత్రి వేళ తిరిగి ట్రాక్టర్లను అటకాయించే ఆ వ్యక్తి ఎవరంటూ గుస గుస లాడుతున్నారు.