calender_icon.png 3 October, 2024 | 6:55 PM

అక్రమంగా ఇసుక తరలిస్తే కటిన చర్యలు...

03-10-2024 02:54:31 PM

రామగిరిలో 4 ట్రాక్టర్ల పట్టివేత

కేసు నమోదు ఎస్ఐ చంద్రకుమార్

మంథని,(విజయక్రాంతి): గోదారి, మానేరు నదుల నుంచి ఇసుక అక్రమాణ చేస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాక్టర్లను సీజ్ చేస్తామని రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ హెచ్చరించారు. గురువారం తెల్లవారుజామున గోదావరి నది నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో రాజాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఎలాంటి అనుమతి లేని నాలుగు ఇసుక ట్రాక్టర్లు దొరకడంతో వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించామని, ట్రాక్టర్లకి  సంబంధించిన యజమానులు మరియు డ్రైవర్లు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ...  అనుమతి లేకుండా ఇసుక తరలించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.