19-02-2025 06:32:22 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలో అక్రమంగా ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని ఎస్సై సత్తీష్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ లతో పాటు డ్రైవర్ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. ఏలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.