01-03-2025 01:01:44 AM
ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం
చర్ల,ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఆరు బయట నిద్రిస్తున్న వలస కూలీలపై ఇసుక ట్రాక్టర్ దూసుకెల్లడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపై ఆసుపత్రి లో చేరారు. వివరాల్లోకెళ్తే మండల పరిధిలోని దండుపేట కాలనీలో వలస కూలీలు ఇద్దరు ఇంటి ముందు నిద్రపోతున్నారు.
వారి పైనుంచి ఇసుక ట్రాక్టర్ దూసుకెల్లడంతో కుంజం సన్ను (18) అనే యువకుడు అక్కడక్కడ మృతి చెందగా, తీవ్ర గాయాల పాలయ్యారు. శత గాత్రుని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా గుర్తించారు. సంఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.