calender_icon.png 2 November, 2024 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలోచవరంలో స్యాండ్ ట్యాక్సీ ప్రారంభం

05-07-2024 03:45:39 PM

మంథని:  పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేస్తే 25 వేలు జరిమానా విధిస్తామని పెద్దపల్లి మైనింగ్ ఏడి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం మంథని మండలంలోని విలోచవరంలో ఉదయం ఆన్లైన్ స్యాండ్ ట్యాక్సీ ఇసుక విధానాన్ని ఆయన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదేశాలతో కలిసి ప్రారంభించారు. మొదటగా మంథని మండలం విలోచవరం గ్రామంలోని ఇసుక రీచ్ నుంచి స్యాండ్ టాక్సీ ప్రారంభిస్తున్నామన్నారు. మంథని పరిధిలో ఇసుక అవసరమున్న వినియోగదారులు ఆన్ లైన్ లో మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని, ఒకరోజు లోపల మీకు ఇసుక అందించనున్నట్లు మైనింగ్ ఏడి  తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే  కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మంథనిలో ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి వీలులేదన్నారు. స్యాండ్ ట్యాక్సి ద్వారా మాత్రమే ఇసుక పొందాలని,  ఇక నుండి రాత్రి, పగలు మైనింగ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారని  ఇసుక ట్రాక్టర్ లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే రూ. 25 వేల జరిమానా విధిస్తామని మైనింగ్ ఏడి శ్రీనివాస్ పేర్కొన్నారు.