జిల్లాలో ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేస్తే 25 వేలు జరిమానా
ప్రారంభోత్సవం లో మైనింగ్ ఏడి శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): జిల్లాలో ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేస్తే రూ. 25 వేలు జరిమానా విధిస్తామని పెద్దపల్లి మైనింగ్ ఏడి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఉదయం ఆన్లైన్ స్యాండ్ ట్యాక్సీ ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదేశాలతో మైనింగ్ ఏడి ప్రారంభించారు. ఖమ్మంపల్లి ఇసుక రీచ్ నుంచి స్యాండ్ టాక్సీ ప్రారంభిస్తున్నామని, ముత్తారం, మంథని, రామగిరి మండలంలోని పరిధిలో ఇసుక అవసరమున్న వినియోగదారులు ఆన్ లైన్ మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని, ఒకటే రోజు లోపల మీకు ఇసుక అందించనున్నట్లు ఏడి తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మంథని, ముత్తారం మండలాల్లో ప్రైవేట్ వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి వీలులేదని, స్యాండ్ ట్యాక్సి ద్వారా మాత్రమే ఇసుక పొందాలని, ఇక నుండి రాత్రి, పగలు మైనింగ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారని ఇసుక ట్రాక్టర్ లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే రూ. 25 వేల జరిమానా విధిస్తామని ఏడి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది రాజు, మాజీ ఎంపీటీసీ అల్లం తిరుపతి, ట్రాక్టర్ యాజమాన్యాలు పాల్గొన్నారు.