calender_icon.png 18 March, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తెలంగాణలో ఇసుక కొరత

18-03-2025 12:00:00 AM

  • అధిక రేట్లతో పేదలకు ఇక్కట్లు

20న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి 

తాపీ సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీశైలం

మహబూబాబాద్, మార్చి 17: (విజయ క్రాంతి) తెలంగాణలో ఇసుక కొరతతో పేద లు అధిక రేటుకు ఇసుకను కొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికు లు ఉపాధి లేక పట్టణాలకు వలస పోతుండగా రానున్న కాలంలో ఇదే కొనసాగితే కార్మికులు ఆకలి చావులు తప్పే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇసుకను ఎలాంటి వ్యక్తులైన అక్రమంగా రవాణా చేయకూడదని చెప్పిన ఇసు కను అక్రమంగా రవాణా చేసేవారు చేస్తుండగా ఇసుక కొరత ఏర్పడుతుందని పేద ప్రజలు వాపోతున్నారు. కాగా గూడూరు తాపీ సంఘం  ఆఫీసులో ఈరోజు ఈ నెల 20వ తేదీన మానుకోట జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుందని పిలుపునివ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కరపత్రా న్ని మండల తాపీ సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీశైలం ఆవిష్కరించగా అనంతరం ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణ లకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డులలో ఆరు నెలలుగా ఆన్లైన్లో సక్రమంగా పనిచేయని కారణంగా పెండింగ్ క్లెయిమ్స్ రెన్యువల్ నమోదు వంటి సమస్యలను వెం టనే పరిష్కరించాలని కోరారు.

బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల నాయకులను నియమించాలని 2009 నుండి 2000 కానీ 14 లక్షల పైన ఉన్న కార్డులను యుద్ధ ప్రాతిపదిక రెన్యువల్ చేయాలని కోరారు రాష్ట్ర బడ్జెట్ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్ గృహసతి అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు తదితర సమస్యల పరిష్కారం కోసం 2025 మార్చి 20 గురువారం రోజున ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం.

సిఐటియు అనుబంధ కార్యాలయం నుండి మహబూబాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుందని భవన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి అంకుస్ సట్ల వెంకన్న లక్ష్మీనారాయణ ఎర్రయాకు నాంపల్లి వెంకన్న దయ్యాల ఉపేంద ర్ జానీ రత్నం కొంకటి బాబు రమేష్ తదితరులు పాల్గొన్నారు.