calender_icon.png 21 September, 2024 | 3:20 AM

అధికారుల కనుసన్నల్లో ఇసుక దందా!

21-09-2024 12:35:46 AM

మొర్రెడు, కిన్నెరసాని వాగుల్లో ఇసుక తోడకాలు

లారీలకొద్దీ అక్రమంగా తరలింపు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇ సుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా  మొర్రెడు, కిన్నెరసాని వాగుల్లో అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నా, లారీలకొద్దీ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచతో పాటు పక్కనే ఉన్న ములకలపల్లి, కొత్తగూడెం మండలాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇసుకాసురులకు  పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అండదండలు మెండుగా ఉండటంతోనే దర్జాగా ఇసుకను తోడి తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

నిల్వచేసి తరలింపు

వాగుల్లోని ఇసుకను అక్రమార్కులు ట్రా క్టర్‌లో ఒక ప్రదేశానికి తరలించి నిల్వ చేస్తా రు. అక్కడి నుంచి రాత్రి వేళల్లో లారీల్లో ఇత ర ప్రాంతాలకు తరలిస్తారు. ఖమ్మం, సత్తుప ల్లి, హైదరాబాద్ పట్టణాలకు రోజుకు 20 ను ంచి 30 లారీల ఇసుక రవాణా జరుగుతు న్నా అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని కుంటినాగులగూడెం వద్ద గల పెట్రోల్ బం కు వెనుక పెద్ద ఎత్తున ఇసుక రాసులు నిల్వ ఉన్నాయి. వాటిని రాత్రికి రాత్రి లారీల్లో ఇత ర ప్రాంతాలకు తరలిస్తు అక్రమార్కుల దం డుకొంటున్నారు. ఇసుక అక్రమ నిల్వలు, ర వాణాపై తహసీల్దార్ వివేక్‌ను వివరణ కోర గా తన దృష్టిలో లేదని, ఆర్‌ఐని పంపించి పరిస్థితిని తెలుసుకుంటామన్నారు. 

5 లారీల ఇసుక సీజ్ 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాసకాలనీ, కు ంటినాగులగూడెం కొత్తపెట్రొల్ బంకు వెను క నిల్వ ఉన్న ఇసుక రాసులను రెవె న్యూ అ ధికారులు శుక్రవారం సీజ్ చే శారు. సు మారు 5 నుంచి 6 లారీల ఇసుకను మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు పట్టణ రెవెన్యు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.