08-04-2025 12:20:00 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, ఏప్రిల్- 7 (విజయక్రాంతి): పదిర, కొండాపూర్ ఇసుక రీచ్ లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై అధికా రులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిర రీచ్ నుంచి ఇసుక రవాణా కోసం అవసరమైన అనుమతులు అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మానేరు నది నూతనంగా గుర్తించిన 6 ఇసుక రీచ్ ల ప్రస్తుత స్థితి గతి పై కలెక్టర్ చర్చించారు. కొండాపూర్ వద్ద ఇసుక కమిటీ సభ్యులు అందించిన నివేదిక ప్రకారం ఒక ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలింపుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పదిర ఇసుక రిచ్ ప్రారంభించిన తర్వాత వెంకటాపూర్ ఇసుక రిచ్ నిలుపు దలకు చర్యలు చేపట్టాలని అన్నారు. కొండాపూర్ మధిర ఇసుక రీచ్ ల ప్రారంభించిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.