calender_icon.png 10 January, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరాలో ఇసుకాసురుల వేట!

10-01-2025 12:35:28 AM

  1. కామారెడ్డి జిల్లాలో ఇసుక దందా
  2. అధికార పార్టీ నేతల అండదండలు?
  3. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండీ

కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిధిలోని కొడిచెర్ల, పోతంగల్ ప్రాంతాల్లో మంజీరా వాగులో జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. గతంలో అనుమతులు పొందిన వారు అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండీకొడు  ప్రభుత్వం క్వారీలను సీజ్ చేసిం ది. ఈ అవకాశం ఇసుకాసురలకు కలిసి వచ్చింది.

వే బిల్లుల గోల లేకుండానే అక్రమంగా వేలాది లారీల ఇసుకను మంజీరా వాగు నుంచి తరలిస్తున్నారు. జిల్లాలోని బిచ్కుంద మండలం పుల్కల్, కోస్గి, డొంగ్లీ, పోతంగల్ పరిసర గ్రామాల్లో ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దందాను అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులే చేస్తుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదని తెలుస్తున్నది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక రవాణా ను అడ్డుకునే కిందిస్థాయి అధికారులపై అక్రమార్కులు దాడులకు సైతం వెనుకాడటం లేదు. బోధన్ సబ్ కలెక్టర్ మహంత్, కామారెడ్డి కలెక్టర్ అశిష్ సంగ్వాన్ స్థానిక అధికారు లను టీమ్‌లుగా ఏర్పాటు చేసి ఇసుక దందా ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇసుక మాఫీయా అడ్డు వచ్చిన అధికారులపై దాడులు చేస్తూ ప్రాణాలు జాగ్రత్త అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నది. 

టెండర్లు వేయకుండా కాలయాపన

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మంజీర నది ప్రవహిస్తున్నది. ఈ నది పరిసర గ్రామాల్లో ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి టెండర్లు వేయిస్తే ప్రతి నెల రూ.కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అధికార పార్టీ నేతలు కొందరు తమ స్వలాభం కోసం ఇసుక టెండర్లను రద్దు చేయించి కాలయాపన చేస్తున్నారు. అక్రమంగా ఇసుకును డంప్ చేసి, హైదారాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు.   చర్యలు తీసుకున్నా చెక్ పోస్టులను దాటిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు విఫలం కావడంతో ఈ నెల 4న పోతంగల్ మండలం కొడిచెర్ల గ్రామస్థులు 15 ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం

మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై ఉన్నతాధి కా  నివేదించాం. ప్రభుత్వం ఇసుక దందాను నిరోధించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండీకొట్టే అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 

 సతీశ్, మైనింగ్ శాఖ 

జిల్లా అధికారి, కామారెడ్డి