calender_icon.png 30 September, 2024 | 3:09 AM

మానేరులో ఇసుక తవ్వకాలు

30-09-2024 01:02:06 AM

నీరు వదిలినా ఆగని రవాణా

కరీంనగర్, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణా కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. శనివారం సాయంత్రం కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లో పెరగడంతో 1.5 అడుగుల మేర రెండు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటికి దిగువకు వదిలారు. నీటి విడుదలకు ఒక రోజు ముందే అధికారులు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్ వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్నారు.

హెచ్చరికను బేఖాతరు చేస్తూ వాగులోకి వెళ్లారు. ప్రవాహం పెరగడంతో ట్రాక్టర్‌ను అక్కడే వదిలి వెనుదిరి గారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఎల్‌ఎండికి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లను మూసివేవారు. నీటి ప్రవాహం తగ్గడంతో మధ్యాహ్నం సమయంలో ట్రాక్టర్లను తీసుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.