calender_icon.png 3 April, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ ఎదుట ఇసుక లేబర్

26-03-2025 01:07:19 AM

  1.  కాంట్రాక్టు మహిళ ఆందోళన 
  2. అధికారులు స్పందించడం లేదంటూ మండిపాటు 

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 25 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం ఇసుక లేబర్ కాంట్రాక్ట్  మహిళలు ఆందోళనకు దిగారు. మణుగూరు మండలం చిన్నరాయి గూడెం గ్రామానికి చెందిన సమ్మక్క- సారలమ్మ గ్రూప్ సభ్యులు 130 మంది జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ అధికారి ఆమోదంతో కమిటీగా ఏర్పడి ఇసుక లోడింగ్ పనులు నిర్వహిస్తున్నారు.

ఆ ప్రాంతాల్లో ఇసుక మాఫియా డాన్ గా మారిన శ్రీకర్ అనే కాంట్రాక్టర్ 20 మందితో గురువుగా ఏర్పడి, కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగించకుండా అడ్డుకొంటూ మహిళలపై కేసులు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. సమ్మక్క -సారలమ్మ గ్రూప్ సభ్యులకు నష్టం చేకూరుస్తున్న శ్రీకర్ పాత అగ్రిమెంట్ రద్దు చేసి నూతన కమిటీకి బాధ్యతలు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు కలెక్టరేట్ ఐటిడిఏ పిఓ వద్దకు వెళ్లి మొర పెట్టుకున్న న్యాయం జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా పేదవారికి న్యాయం చేయకుండా ఉన్నవారి పక్షాన మాట్లాడుతున్నారని మహిళలు మండిపడ్డారు.