17-04-2025 01:27:03 AM
* అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
సూర్యాపేట, ఏప్రిల్16 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్లుకి ఇసుక ఉచితంగా ఇస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా ఎస్పి నరసింహ తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఇసుక విధానంపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట విరుద్దంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. పోలీస్ వారు అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు గుర్తిస్తే సంబంధిత తహసీల్దార్ కి అప్పగించాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలు కలెక్టర్ అనుమతి లేనిదే తహసీ ల్దార్‌లు విడుదల చేయరాదని ఆదేశించారు. తహసీల్దార్‌లు జారీ చేసిన వె బిల్లులో సమ యం, వాహనం నెంబర్, ఫోన్ నెంబర్, ఎక్క డ నుండి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నారో అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని తెలిపారు.