calender_icon.png 9 March, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ యార్డుల్లోనూ ఇసుక విక్రయం

09-03-2025 12:30:16 AM

  1. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డు (ఏఎంసీ)ల్లోనూ ఇసుక విక్రయాలు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్ర మార్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శనివారం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి నిర్వహించిన రెవెన్యూ రిసో ర్స్ మొబైల్ జేషన్ సబ్ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇసుక విక్రయిస్తున్నదని తెలిపారు. ప్రజాప్రయోజనాలు నెరవేర్చడంలో మైన్స్ శాఖ పాత్ర కీలకమని, ఇసుక విక్రయాలకు సంబంధించి వెంటనే ఐటీడీఏలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.

బడ్జెట్‌లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ప్రభుత్వశాఖలు అధిగమించాలని సూచించారు. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలపై ప్రతినెలా ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు సమీక్షించాలని ఆదేశించారు. వాటి  వివరాలను మూడు నెలలకోసారి క్యాబినెట్ సబ్ కమిటీకి  నివేదించా లని సూచించారు.

ప్రభుత్వం రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటి అమలుకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను విస్తృతంగా అన్వేషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరా న్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డును దాటించాలని ఆదేశించారు. 

కులగణన సమాచారంపై అధ్యయనం చేయండి

కుల గణనలో అందిన సమాచారాన్ని పరిశీలించి ఏ వర్గాలు రాజకీయంగా, ఆర్థికం గా వెనుకబడి ఉన్నాయి? సంక్షేమ ఫలాలకు నోచుకోని వారు ఎవరు? అనే అంశాలను విశ్లేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. కుల గణన అధ్యయ నానికి నియమితులైన స్వతంత్ర, మేధావుల కమిటీ సభ్యులకు శనివారం ఆయన కాల్ చేసి సూచనలు, సలహాలిచ్చారు.

అంకెలు, సంఖ్యల ఆధారంతో సంపూర్ణంగా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల వ్యవధిలో నివేదిక అందజేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్రప్రభుత్వం జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్ష్యతన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.