చోద్యం చూస్తున్న అధికారులు
మంథని : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఖమ్మంపల్లి మానేరు నది నుండి రామగిరి, బేగంపేట్, సెంటరనికాలనీ ఇతర ప్రాంతాలకు రాత్రి, పగలు అని తేడా లేకుండా గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు రెవిన్యూ శాఖ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.