- మంథనిలో పర్మిషన్ పేరుతో ఇసుక అక్రమ రవాణా
- జిల్లాలో సామాన్య ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక సంఫరా చేయనున్న ప్రభుత్వం
- ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే పరిమిషన్
- ఆసరా తీసుకొని అందినకాడికి దండుకుంటున్న ట్రాక్టర్ యాజమాన్యాలు
- నిర్దేశిత ధర కంటే అధికంగా ధరలు ఇసుక విక్రయిస్తున్న ట్రాక్టర్ యాజమాన్యాలు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పెద్దపల్లి, జనవరి 16: మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతుంది మంథని లో ఇసుక మాఫియా వ్యాపారం. పేద ప్రజ లకు తక్కువ అతి తక్కువ ధరకు ఇసుకను అందించి.. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నూతన పాలసీని తీసుకువచ్చారు.
సామాన్య ప్రజలు తమ సొంత అవసరా లకు జిల్లాలోని 6 ఇసుక రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్లవచ్చని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఇటీవలే జిల్లా కలెక్టర్ సమీవృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సాండ్ కమి టి సమావేశం నిర్వహించి నూతన ఇసుక పాలసీ ఆమోదించారు.
(గురువారం) జన వరి 16 నుంచి జిల్లాలో సామాన్య ప్రజలు తమ సొంత అవసరాలకు జిల్లాలోని 6 రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చని అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో వినియో గించుకునేందుకు జిల్లా ప్రజలు సుల్తానా బాద్‌లోని నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారం లోని ముత్తారం, అడవి శ్రీ రాంపూర్, మం థని లోని విలోచవరం, అంతర్గాం లోని గోలివాడ ఇసుక రీచ్ లలో ఎక్కడి నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకోవచ్చని పరిమిషన్ ఇచ్చారు.
ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా తీసుకునే ఇసుక సొంత అవసరాలకు మాత్ర మే వాడాలని, ఈ ఇసుకను మన జిల్లా పరిధిలో మాత్రమే వాడాలని, ఎక్కడా ఇసు క డంప్ లు సష్టించడానికి వీలు లేదని, ఇసుక డంప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిం చాలని చూస్తే కఠినచర్యలు తీసుకుంటామ ని కలెక్టర్ హెచ్చరించారు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక తరలించాలని, సాయంత్రం 5 తరువాత ఇసుక తరలిస్తే సం బంధిత వాహనాలను సీజ్ చేసి మొదటి సారి రూ. 25 వేల జరిమానా, రెండవ సారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇసుక తరలింపు కోసం వినియోగించే ట్రాక్టర్ ఓవర్ లోడ్ కావడానికి వీలు లేద ని, డ్రైవర్‌కు తప్పనిసరిగా లైసెన్సు ఉండా లని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి వీలు లేదని, వాహనానికి తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అన్ని వైపులా అంటించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 6 ఇసుక రీచ్ లకు సంబంధిత తహసిల్దార్లు ప్రత్యేకంగా సిబ్బం ది కేటాయించి, ప్రతి రోజు తరలించే ఇసు క వాహన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు.
ప్రతి వారం ఇసుక తర లింపు వివరాలను కలెక్టర్‌కు సంబంధిత తహసిల్దార్లు నివేదిక అందించాలని అన్నా రు. జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి తీసు కునే ఇసుక ప్రజలకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధర మించకుండా విక్రయిం చాలని, ట్రాక్టర్ ఇసుక పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో రూ. 1400, సుల్తానాబాద్ లో రూ. 1000, జూలపల్లిలో రూ. 1700, ఓదెల లో రూ. 1150, శ్రీరాంపూర్ లో రూ. 1100, పాలకుర్తి లో రూ. 2500, అంతర్గాం లో రూ. 1000, రామగుండంలో రూ. 2600, మంథని లో రూ. 1500, ధర్మారంలో రూ. 2300, కమాన్ పూర్ లో రూ. 2200, రామగిరి లో రూ. 2200 మాత్రమే విక్రయించాలని తెలుపగా, జిల్లాలో ఎక్కడైనా ట్రాక్టర్ ఇసుక నిర్ణీత ధర కంటే అధికాంగా విక్రయిస్తే 08728 223318, 08728 223310 ఫోన్ నెంబర్ల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫిర్యాదు చేస్తే... సంబంధిత ట్రాక్టర్ల ను సీజ్ చేస్తామని, మొదటి సారి రూ.శ25 వేలు, రెండవ సారి రూ. 50 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 6 ఇసుక రీచ్‌ల నుంచి పెద్ద పెల్లి జిల్లా రిజిస్టర్ ట్రాక్టర్లు మాత్రమే ఇసుక తీసుకొని వెళ్లాలని, లారీలు, టిప్పర్లు వంటి పెద్ద వాహనాలు, ఇతర జిల్లాల ట్రాక్టర్లు వినియోగించేందుకు వీలు లేదన్నారు.
పర్మిషన్ పేరుతో ఇసుక దందా
పర్మిషన్ పేరుతో ఇసుక అక్రమంగా తరలించేందుకు కొంతమంది టాక్టర్ యాజ మాన్యులు పూనుకున్నారు. ఇంకేముంది కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారు.. అంటూ ఖమ్మం పల్లి మానేరు లో శుక్రవారం మంథని నుంచి వచ్చిన టాక్టర్లు పర్మిషన్ పేరుతో అక్ర మ ఇసుకను మంథని కి తరలిస్తున్నారు. ఈ విషయంపై తాసిల్దార్ మైనింగ్ అధికారు లను అడగగా వెంటనే పోలీసులకు సమాచా రం ఇచ్చి మంచానికి చెందిన ఒక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.