అక్రమంగా తవ్వి తరలింపు
దందాలో మూడు రాష్ట్రాల ఇసుక మాఫీయా
అధికారుల అండతో రెచ్చిపోతున్న వైనం
కామారెడ్డి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంజీర నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. ఈ దందాను తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫీయా యథేచ్ఛగా రోజుకు వందకు పై గా ఇసుక టిప్పర్‌లను ఇతర ప్రాంతాలకు త రలిస్తున్నారు.
పోలీసులు, రెవెన్యూ యం త్రాంగం మమూళ్లకు అలవాటు పడి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చినప్పుడే హ డావుడి చేసి కొన్ని టిప్పర్లను పట్టుకుని కేసు లు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఈ మండలాల్లోనే అధికం..
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, బిచ్కుంద, డొంగ్లీ మండలాల్లో రాత్రి వేళల్లో మంజీర న ది నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక ను తరలిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 5 నుం చి 10 టిప్పర్ల ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు.
బిచ్కుంద సర్కిల్ పరిధిలోని ఒక్కో అధికారికి పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తూ ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడ్డ టిప్పర్లపై పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సీజ్‌చేయాల్సి ఉండగా ముడుపులు అందుకొని నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదలి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు
ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు, టీజీఎంబీసీ అధికారులు కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇసుక క్వారీలను సీజ్ చేసి అక్కడ పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐదుగురిని విధుల నుంచి తప్పించారు.
అంత వరకు బాగానే ఉన్న అక్రమ ఇ సుక దందా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇటీవల రెండు, మూడు క్వారీల తవ్వ కాలకు టీసీఎన్‌డీసీ అనుమతి ఇచ్చింది. దీం తో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది.
రవాణా ఇలా..
బిచ్కుంద మండల పరిధిలోని హస్గుల్, షెట్లూర్, ఖడ్గవ్ గ్రామాల పరిధిలో గుట్టుగా డంప్‌లు చేస్తున్నారు. ఆ డంప్‌ల నుంచి టిప్పర్ల ద్వారా తెలంగాణలోని హైదారాబాద్, నిజామాబాద్, కర్ణాటక, మహరాష్ట్రలోని బీదర్, నాందెడ్, గుల్బార్గా, ధర్మాబాద్, ఔరంగాబాద్ పట్టణాలకు తరలిస్తున్నారు.
జిల్లా సరిహద్దు అయిన పొరుగు జిల్లాకు చెందిన కోటగిరి మండలం పోతంగల్ వద్ద కొందరు చోటమోట నాయకులు అక్రమంగా ఇసుకను తవ్వి డంప్ చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా టిప్పర్‌లు, లారీల ద్వారా బీర్కూర్, బిచ్కుంద మండల కేంద్రాల మీదు గా 161వ జాతీయ రహదారిపైకి ఎక్కించి హైదారాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అధికారిపై మాఫీయా దాడి?
అక్రమ రవాణా చేస్తుండగా భూగర్భ జలాల అధికారి నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం రాత్రి మాటు వేసి 5 టిప్పర్లలో ఒక టిప్పర్‌ను పట్టుకున్నారు. కాగా అక్కడ ఇసుక స్మగ్లర్లు దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది. పట్టుబడిన టిప్పర్‌ను బిర్కూర్ పోలీసులకు అప్పగించారు.
అయితే బీర్కూర్ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే ఇసుక టిప్పర్‌లు వెళ్తుండటం గమనార్హం. 4 టిప్పర్‌లు ఇసుకతో పోలీస్‌స్టేషన్ ముందు నుంచే వెళ్లినా పట్టుకోని అధికారులు.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ మరోకుంటి సాకు పోలీసులు చెబుతున్నారు.
అంతేకాకుండా భూగర్భజలాల ఏడీ నాగేశ్వర్‌రావుపై ఇసుక వ్యాపారులు దాడి చేసినా పోలీస్‌లు పట్టిం చుకోకపోవడం కలెక్టర్ బాన్సువాడ డివిజన్‌లోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వానికి రూ.30లక్షల గండి
గత రెండు నెలల క్రితం క్వారీలు నిర్వహించిన ఇసుక మాఫీయా రూ.30 లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నదని కామారెడ్డి జిల్లా బిచ్కుంద బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టుకు విన్నవించింది. సుమోటాగా స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి గండి కొడుతున్న ఇసుక క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే అంతకుముందే అధికారులు ఇసుక కార్వీల నిర్వాహకుల లైసెన్స్‌లను రద్దు చేశారు. ఇసుక అక్రమాలు అగిపోయాయని భావించారు. కానీ ఎప్పటిలాగే ఇసుక దందా కొనసాగుతున్నది.
ఇటీవల బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్‌కు వెళ్తుండగా ఇసుక లోడ్‌తో వెళ్తున్న 12 ట్రాక్టర్లు కన్పించాయి. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇసుకను సీజ్ చేయడంతో పాటు ఖాళీ చేసిన ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించి, జరిమానా వేసి వదిలిపెట్టారు.
అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు
జిల్లాలో అక్రమ ఇసుక రవాణ చేపడుతున్న వారిపై చర్యలు తీసుకుంటు న్నాం. ఇటీవల ప్రభుత్వం మంజీరలో ఇసుక తవ్వకాలను రద్దు చేసింది. అక్ర మ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూగర్భజల శాఖ ఏడీ నాగేశ్వ ర్‌రావుపై దాడి చేసిన వారిపై పోలీసుల కు ఫిర్యాదు చేశాం.
నగేష్, జిల్లా మైనింగ్ అధికారి, కామారెడ్డి