calender_icon.png 19 April, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక డంప్ సీజ్

18-04-2025 12:44:09 AM

చేర్యాల, ఏప్రిల్ 17  అనుమతులు లేకుండా ఇసుకను నిలువ చేసిన డంపులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వేచరేణి శివారులో ఇసుక ఆక్రమాదారులు ఎలాంటి అనుమతులు లేకుండా నిలువ చేస్తున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలు లోకి వెళ్లి పరిశీలిం చారు. ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆ డంపులను సీజ్ చేశారు.

ఈ డంపులు సుమారు 60,70 ట్రా క్టర్లు దాకా  ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సమీర్ హమ్మద్  ఖాన్ మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేసిన, నిలువ చేసిన కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేయొద్దని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజేందర్ రెడ్డి ఉన్నారు.