calender_icon.png 20 February, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1,600కే ఇసుక డోర్ డెలివరీ

18-02-2025 12:31:57 AM

  1. 24గంటల పాటు బుకింగ్ 
  2. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితం
  3. మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): అక్రమాలకు చెక్‌పెట్టేందుకు విని యోగదారులకు నేరు గా ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నట్లు మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా డోర్‌డెలి వరీ సిస్టమ్ లేదని, తొలిసారిగా రాష్ట్రం లో తీసుకురా బోతున్నట్లు  చెప్పారు.

టన్నుకు రూ. 1,600లోపే ఇసుక డోర్ డెలివరీ చేసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) ఆధ్వర్యంలో మరో రెండు నెలల్లో ప్రత్యేకంగా యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు. సోమవారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  మాట్లాడారు..

డోల్ డెలివరీకి భారీగా రవాణా వ్యవస్థ అవసరమని ఇందుకోసం త్వరలో టెండర్లు పిలు స్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు.  రాష్ట్రంలో ఇసుక మాఫియా ఉండకూడదని ఈనెల 10న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఓవర్‌లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు చెప్పారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా మూడు షిప్టుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను పరిశీలించేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. 

24 గంటలు ఇసుక బుకింగ్..

అక్రమాలకు తావు లేకుండా ఇసుక స్లాట్ ను 24గంటల్లో ఎప్పుడైనా బుక్‌చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చామన్నారు. ఇసుక బిల్లులను నెలరోజులకోసారి చెల్లించాలని నిర్ణయించినట్లు శ్రీధర్ వెల్లడించారు. ఇసుక రవాణా వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.628కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ రీచ్‌లో వేబ్రిడ్జిలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుకను తీసుకెళ్లే వాహనాలకు 45రోజుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. 

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్‌రెడ్డి

ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని కలె క్టర్లు, ఎస్పీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని సూచిం చారు. ఇసుక రీచ్‌లను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్ట కుండా, ఇసుక ఓవర్‌లోడ్‌తో పాటు అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు.

రెండు రోజుల్లో రియల్టర్స్‌తో సమావేశం

ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై చర్చించేందుకు రెండో రోజుల్లో రియల్టర్స్‌తో భేటీ కానున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఇప్పటికే కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే 984809 4373, 7093914343 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే, హైదరాబాద్‌కు ఇసుకను రవాణా చేసేందుకు ఓఆర్‌ఆర్ చుట్టు 5వరకు స్టాక్ యార్డ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.