calender_icon.png 20 April, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో సాండ్ బజార్

17-04-2025 01:10:56 AM

- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 16 : ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీలో సాండ్ బజార్ టీజీఎండిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రంగారెడ్డి, టీజీఎండిసి చైర్మన్ అనిల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ను కట్టడి చేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాండ్ బజార్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. వినియోగదారులకు వీలుగా వారి అవసరాల మేరకు ఇసుక డోర్ డెలివరిని కూడా చేస్తుందన్నారు. ఎక్కడ అవినీతికి తావులేకుండా పక్కడబందిగా సాండ్ బజార్ కేంద్రాలను నిర్వహిస్తాం అన్నారు.

దొడ్డు ఇసుక ప్రతి మెట్రిక్ టన్నుకు రూ.1600, సన్న  ఇసుక రూ.1800 లకే అందిస్తున్నట్లు తెలిపారు. 24/7 బుకింగ్ సౌకర్యం ఉంటుందని, 365 రోజులు ఇదే ధరకు లభిస్తుందని తెలిపారు. సుమారు 1600 లారీలతో ఎక్కడకి కావలన్న ఇసుక రవాణా జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం కోసజం పనిచేస్తుందని అన్నారు.

సన్న బియ్యం పంపణి తో పేదవాడి కడుపు నింపుతున్నామని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చబోతున్నామని, త్వరలోనే రేషన్ కార్డుల పంపణి కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ (మామ), పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.