22-02-2025 05:43:47 PM
546 ఇసుక ట్రాక్టర్ ట్రిపులకు రూ. 1822వేలం దక్కించుకున్న నరేష్
పెబ్బేరు,(విజయక్రాంతి): పెబ్బేరు మండలంలోని రంగాపూర్, రాంపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 546 ఇసుక(Sand) ట్రాక్టర్ ట్రిపులను ఇటీవల కాలంలో అధికారులు దాడులు నిర్వహించి సిజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ కార్యాలయం(Revenue Office)లో తహసీల్దార్ లక్ష్మీ 546 ఇసుక ట్రాక్టర్ ట్రిపులకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇసుక వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక ట్రిపుకు అధికారులు వేలం ప్రారంభం ధర రూ.1800 నిర్వహించారు. అంత వేలం పాట పాడితే మాకు గిట్టుబాటు కాదని స్థానిక ఇసుక వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలం పాట తగ్గించి పాడాలని అధికారులు, ఇసుక వ్యాపారస్తుల మధ్య గందరగోళం కొనసాగింది. వేలం పాటను ఆపండి మా గోడును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని స్థానిక ఇసుక వ్యాపారస్తులు కోరారు. జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇసుక వేలం పాట నిర్వహిస్తున్నామని తహసీల్దార్ లక్ష్మీ తెలిపారు. వనపర్తికి చెందిన నరేష్ రూ.1822 వేలం పాడి దక్కించుకున్నారు.