calender_icon.png 15 March, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ఖమ్మంపల్లిలో ఇసుక మట్టి మాఫియా

15-03-2025 12:37:03 AM

ఖమ్మంపల్లి గ్రామస్థులు తీర్థాల కొమురయ్య ఆవేదన

 మంథని మార్చి 14 (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని ఇప్పలపల్లి శివారు తీర్థాల కొమురెల్లి సర్వేనెంబర్ 387 ఆరెకరాల 38 గుంటల నుండి నా ఇంటి అవసరం కోసం ముత్తారం తహసిల్దార్ కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వలేదని తీర్థాల కొమురయ్య ఒక ప్రకటనలో శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ ఖమ్మం పల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుంచి అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా అధికారుల పర్యవేక్షణలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఇసుక, ఎర్ర, నల్ల మట్టి అక్రమ రవాణా జరుగుతున్న ఏ మాత్రం పట్టించుకోవటం లేదని, రెవెన్యూ, మైనింగ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి గుట్ట నుండి అక్రమంగా తరలిస్తున్న రెండు ఎర్రమట్టి ట్రాక్టర్ లను అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో పట్టుకున్న కానిస్టేబుల్ రమేష్ ఆ ట్రాక్టర్ లను  పోలీస్ స్టేషన్ తరలించకుండా మధ్యలోనే ఆపేసి వదిలేశారని,  గతంలో కూడా చాలాసార్లు 100 కు డయల్ చేసినప్పుడు వచ్చిన ముత్తారం కానిస్టేబుల్ అంతా నా ఇష్టం.

ఇది నా కనుసనల్లో నడుస్తుందని, పోలీస్ అనే  అహంకారతో, గర్వంతో  మాట్లాడుతున్నాడని, ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నేను గతంలో సస్పెండ్ అయి మళ్లీ ఉద్యోగంలో చేరాను.?? నువ్వేం చేస్తావని నన్ను బెదిస్తున్నాడని ఆ బాధితుడు వాపోయ్యాడు. ఇప్పుటి కైనా రెవెన్యూ, మైనింగ్ అధికార యంత్రాంగం ఈ సమస్యపై స్పందించి కానిస్టేబుల్ రమేష్ ను విధులు నుంచి తొలగించి  అక్రమ మాఫియా వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ఒక ప్రకటనలో వారు తెలిపారు..