హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మహిళాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 22 జిల్లాల్లో తెలంగాణ ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులను కాంగ్రెస్ సర్కార్ మంజూరు చేసింది. 22 జిల్లాల్లో రూ.110 కోట్లతో నిర్మించనున్న మహిళా శక్తి భవనాల నిర్మాణంలో ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఈ భవనాల నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతినిచ్చింది. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకే జిల్లా కేంద్రాల్లో మహిళా శక్తి భవన్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వరంగల్ జిల్లా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రజా పాలన కాంగ్రెస్ విజయోత్సవంలో భాగంగా నవంబర్ 19న ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.