calender_icon.png 7 March, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజూరైన పనులు వెంటనే పూర్తిచేయాలి

06-03-2025 12:45:57 AM

కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్

నారాయణపేట, మార్చి 5(విజయక్రాంతి):కొడంగల్ నియోజకవర్గంలో మంజూరైన నిర్మాణ పనులను వెంటనే  పూర్తి  చేయాలని  సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం  కొడంగల్ లోని కడా కార్యాలయంలో  నియోజ కవర్గంలో  జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై వికారాబాద్, నారాయణపేట  జిల్లాల కలెక్టర్ లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు, ఎలక్ట్రిసిటీ,  త్రాగు నీరు, భగీరథ మిషన్ పైపు లైన్ లు, పంచాయతీ రాజ్,  ఆర్ అండ్ బి శాఖ ల ద్వారా ఇప్పటికే మంజూరైన వివిధ నిర్మాణ పనులు ప్రారంభించిన  వాటిని  కాంట్రాక్టర్ లతో పాటు జాయింట్  ఇన్స్పెక్షన్  పూర్తి అయిన  పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఇడబ్యూఐడిసి ద్వారా మంజూరరైన  బిసి బాయ్స్, డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల నిర్మాణానికి మొదలు పెట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలనీ అన్నా రు. దౌల్తాబాద్ కెజిబివి, పిఎసి, బొంరాస్ పేట మండలాల్లో చేపట్టే పాఠశాల భవన ము, అంగన్వాడీ, మహిళా సమాఖ్య బిల్డింగ్, గ్రామ పంచాయతీ  బిల్డింగ్ పనులకు టెండర్ లను పూర్తి చేయాలనీ, షాదీఖానా నిర్మాణానికి ప్లాన్ తయారు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఆర్ అండ్ బి ద్వారా చేపట్టే పనులను వెటర్నరీ, వైద్య కళాశాలలకు  సంబంధించిన పనులను  త్వరలో మొదలు పెట్టాలని  అధికారులకు సూచించారు. 

దుద్యాల, హకీంపేట్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి,జరుగుతున్న ప్రతి పనికి  సంబందించిన ఫోటోలను ప్రతి రోజు గ్రూపులో అప్లోడ్ చేయాలన్నారు. పనులు జరుగుతున్న క్రమం లో ఏవైనా సమస్య లు ఎదురైతే మా దృష్టి కి  తీసుకురావాలన్నారు. ముఖ్యంగా వేసవి కాలం  ఉన్నందు న త్రాగునీటీ సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం  కొడంగల్ లో నూతనంగా నిర్మా ణం జరుగుతున్న  ప్రభుత్వ ఆసుపత్రి బిల్డిం గ్ మరియు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్  నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో  కడ ప్రత్యేక అధికారి  వెంకట్ రెడ్డి, నారాయణ పేట ఆర్డీఓ రామచందర్, పంచాయతి రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ  వసంత్ నాయక్,   ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ లీలా వతి,  ఈడబ్ల్యూఐడిసి ఇఇ వై.వి రాంకుమార్,  ఇంజినీరింగ్ విభాగం ఈ ఈ లు, డిఇలు సంబంధిత అధికారులు,తదితరులు  పాల్గొన్నారు.,