01-03-2025 10:37:59 PM
మెడికల్ కళాశాలకు తీరనున్న లో వోల్టేజి సమస్య...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ ప్రాంతంలో లో ఓల్టేజ్ సమస్యను అధిగమించి నాణ్యమైన విద్యుత్ అందించాలన్న లక్ష్యంతో ఉయ్యాలవాడలో నూతనంగా మరో 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎనిమిది సబ్ స్టేషన్ లను మంజూరు చేయించగా తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి మరో 33/11 కెవి నూతన విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేస్తూ ప్రకటించినట్లు తెలిపారు. దీంతో విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్న మెడికల్ కళాశాలతో పాటు నాగర్ కర్నూల్ మున్సిపాలిటి పరిధిలోని ఉయ్యాలవాడ పరిసర ప్రాంతాలకు మేలు జరగనున్నట్లు తెలిపారు.