calender_icon.png 29 April, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మం తల్లి ఒడిలోనే ప్రారంభం

28-04-2025 01:01:18 AM

సిద్దేశ్వర మహారాజ్ 

జహీరాబాద్, ఏప్రిల్ 27 : ప్రతి హిందువు సనాతన ధర్మాన్ని తల్లి ఒడి నుంచి ప్రారంభమవుతుందని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహా మండలేశ్వర బిరుదాంకితులు సిద్దేశ్వరునంద మహా రాజు అన్నారు. ఆదివారం నాడు జహీరాబాద్ నియోజకవర్గంలోని కుప్పానగర్ గ్రామంలో గుబ్బడి సంగమేశ్వర ఆలయం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళా భజన మండలి వారు పాలుపంచుకున్నారు. మహిళలు చిన్నతనం నుండే తమ పిల్లలకు సనాతన ధర్మం గురించి నేర్పించాలని సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు ఇవ్వ కుండా పిల్లలు ఏడ్చినప్పుడు దేవుని నామస్మరణ చెప్పాలని లేదా దేవుని మందిరంలో గల గంటా శబ్దంతో వారు ఏడుపును మాన్పించాలని తెలిపారు.

కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎక్కడో ఒక దగ్గర హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పండరినాథ్, కమిటీ సభ్యులు యాదగిరి, సిద్ధప్ప, శివకుమార్, కిష్టన్న, పండరి స్వామి పాల్గొన్నారు.