చేర్యాల, జనవరి 17: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా చేర్యాల పట్టణంలో శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రకు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు రానున్న నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నించలనుకోవడం దేశ ప్రజలను అవమానించడమే నన్నారు. రాజ్యాంగ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, నాయకులు పుర్మా ఆగం రెడ్డి, ఆడెపు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.