calender_icon.png 14 November, 2024 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంసన్ తడాఖా

09-11-2024 01:37:32 AM

శతకం బాదిన టీమిండియా స్టార్

  1. రాణించిన వరుణ్, బిష్ణోయి
  2. తొలి టీ20లో భారత్ విజయం

  3. డర్బన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

సంజూ శాంసన్ (50 బంతుల్లో 107) మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా..  తిలక్ వర్మ (33) రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జే 3 వికెట్లు తీయగా.. క్రూగర్, పీటర్, జాన్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో క్లాసెన్ (25) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. రవి బిష్ణోయి 2 వికెట్లు పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.

సంజూ దూకుడు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఏడు పరుగులు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ కొయట్జీ బౌలింగ్‌లో మార్కరమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో మాత్రం సంజూ శాంసన్ మాత్రం ఆరంభం నుంచి దూకుడుగా ఆడడంతో భారత్ స్కోరు బోర్డు పరు గులు పెట్టింది.

27 బంతుల్లోనే అర్థసెంచరీ మార్క్ సాధించిన శాంసన్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రెండో అర్థసెంచరీకి కేవలం 20 బంతులు మాత్రమే తీసుకో వడం విశేషం.  తద్వారా టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు.

కెప్టెన్ సూర్య వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (18 బంతుల్లో 33) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. శాంసన్ ఔట్ కాగానే భారత్ ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. 14 ఓవర్లలో 160కి పైగా పరుగులు చేయడంతో 250 పరుగులు సాధిస్తుందనుకుంటే చివరి 6 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ కేవలం 40 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది.

అర్ష్‌దీప్ వేసి న తొలి ఓవర్‌లో మార్కరమ్ (8) శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 49 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను క్లాసెన్, మిల్లర్ చక్కదిద్దే క్రమంలో వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో వారిద్దరిని పెవిలియన్ చేర్చి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేయాల్సిన పరుగులతో పాటు రన్‌రేట్ పెరిగిపోవడంతో సఫా రీ లకు ఓటమి తప్పలేదు.

సంక్షిప్త స్కోర్లు

టీమిండియా: 20 ఓవర్లలో 202/8 (శాంసన్ 107, తిలక్ 33; కోయెట్జే 3/37),

దక్షిణాఫ్రికా: 17.5 ఓవర్లలో 141/10 (క్లాసెన్ 25, రికిల్‌టన్ 21; వరుణ్ 3/25).