calender_icon.png 23 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంసన్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

21-09-2024 12:00:00 AM

  1. ఐదేళ్ల తర్వాత సెంచరీ 
  2. దులీప్ ట్రోఫీ మూడో రౌండ్

అనంతపురం: దులీప్ ట్రోఫీ మూడో రౌండ్‌లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి జట్టు ఆటగాడు సంజూ శాంసన్ (106) సెంచరీతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో శాంసన్ ఐదేళ్ల తర్వాత శతకం బాదడం విశేషం. సంజూతో పాటు ఓపెనర్లు పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52) అర్ధ సెంచరీలు చేయడంతో ఇండియా-డి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-బి జట్టు రెండో రోజు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

క్రీజులో సుందర్ (39*), చహర్ (0*) ఉన్నారు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) సెంచరీతో కదం తొక్కాడు. ఇండియా-సితో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకే పరిమితమైంది. శాశ్వత్ రావత్ (124) సెంచరీ చేసినప్పటికీ మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. ఇండియా-సి బౌలర్ వైశాక్ విజ య్‌కుమార్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండి యా-సి జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇక ఇండియా-బి జట్టుకు ఆడుతున్న టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ పూర్తిగా నిరాశపరిచాడు.