calender_icon.png 20 April, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓదెల మల్లన్న తాండవం మూవీ సక్సెస్ మీట్‌లో సంపత్ నంది

18-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఓదెల2. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్‌తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై డీ మధు నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలైంది. విడుదలైన అన్నిచోట్లా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సక్సెస్ ప్రెస్‌మీట్‌లో మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. మేము ఆశించిన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా లేడీస్‌తో, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈరోజు ఒక ప్రీమియర్‌లాగా మొదలైంది. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతుంది.

శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు చాలా సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి” అన్నారు. ప్రొడ్యూసర్ మధు మాట్లాడుతూ..  ‘సుదర్శన్ 35 ఎంఎంలో ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశా ను. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది.

ముఖ్యంగా లేడీస్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇది మర్చిపోలేని రోజు’ అని చెప్పారు. వశి ష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. ‘థియేటర్లలో ఆడియోస్‌తో కూర్చు ని సినిమా చూశాను.  రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఇది నాకు ఎ ప్పటికీ గుర్తుండిపోతుంది. శివతాండవం థియేటర్లలో మొదలైంది. దాని విశ్వరూపం రేపట్నుంచి అందరికీ అర్థమవుతుంది’ అన్నారు.