calender_icon.png 19 April, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపత్ నగర్ యువకునికి సంగీతంలో గిన్నీస్ బుక్ రికార్డ్‌లో చోటు

17-04-2025 12:34:41 AM

టేకులపల్లి, (విజయక్రాంతి): పట్టుదల సాధించాలనే లక్ష్యం ఉంటే తప్పక సిద్ధిస్తుందని ఆచరణలో నిరూపించాడు కు గ్రామా నికి చెందిన కుడితేటి  రమేష్‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ గ్రామానికి చెందిన కుడితేటి రమేష్ కు సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానం దక్కింది. కుడితేటి రమేష్ బృందం సంగీతంలో గిన్నిస్ వరల్ రికార్డు సాధించింది.

హైదరాబాద్ హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకుల చేతుల మీదుగా  సోమవారం మెడల్ అందుకున్నారు. కుడితేటి రమేష్ సంగీతం అంటే మక్కువ. హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో అతను పాల్గొన్నారు. కీబోర్డు వాయిస్తున్న సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేశారు.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ బృం దంలో కుడితేటి రమేష్ ఉన్నారు. పాస్టర్ ఆగస్టిన్ చేతుల మీదుగా మెడల్ తోపాటు సర్టిఫికెట్ అందుకున్నారు. పట్టుదలతో సంగీతం నేర్చుకున్నానని, గిన్నిస్ వరల్ రికార్డుతో అరుదైన గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన యువకునికి అరుదైన అవార్డు రావడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు.