calender_icon.png 15 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు సమోసా గిఫ్ట్

10-11-2024 02:02:56 AM

హర్యానాలో సీఎం సుఖ్విందర్ సింగ్ చిత్రపటానికి సమోసాలు తినిపిస్తున్న బీజేపీ నేతలు

11 సమోసాలు పంపిన బీజేపీ ఎమ్మెల్యే

హిమాచల్ ప్రదేశ్, నవంబర్ 9: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సమోసా వివాదం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సమోసా విషయమై మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్‌కి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేవారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా గతనెల 21న సీఎం సుఖ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి ఓ ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితేగ తమకోసమే సమోసాలు తెప్పించారని పొరపాటున పోలీసు సిబ్బంది వాటిని ఆరగించారు. అయితే వేదికపై సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బంది పడ్డారు.

ముఖ్యమంత్రి సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో అధికార కాంగ్రెస్‌పై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసా కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను సీఎం కార్యాలయం ఖండించింది. ఇదంతా బీజేపీ సృష్టిస్తున్న నాటకం అని కొట్టిపారేసింది. ఓ వైపు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సీఎంకు 11 సమోసాలను ఆర్డర్ చేస్తే.. మరోవైపు  శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.