calender_icon.png 27 October, 2024 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌పీఎస్ చందాదారులకు సేమ్‌డే సెటిల్‌మెంట్

29-06-2024 12:42:05 AM

  • పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ ప్రకటన

న్యూఢిల్లీ, జూన్ 28: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) చందాదారులకు జూలై1 నుంచి సేమ్‌డే సెటిల్‌మెంట్ (టీ+0 సెటిల్‌మెంట్)సదుపాయాన్ని పెన్షన్ ఫండ్  రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కల్పించింది. ఏ సెటిల్‌మెంట్ రోజులోనైనా ఉదయం 11 గంటలవరకూ ట్రస్టీ బ్యాంక్‌కు అందే ఎన్‌పీఎస్ పెట్టుబడి మొత్తానికి చందాదారులు అదే రోజున ఉండే ఎన్‌ఏవీ (నికర ఆస్తుల విలువ) ప్రయోజనాన్ని పొందగలుగుతారని పీఎఫ్‌ఆర్‌డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రస్టీ బ్యాంక్‌చందాదారుల నుంచి పొందే మొత్తాన్ని మరుసటి సెటిల్‌మెంట్ రోజు (టీ+1) ఇన్వెస్ట్ చేస్తుందని, ఇకనుంచి ఉదయం 11 గంటలవరకూ అందే మొత్తాల్ని అదే రోజు వర్తించే ఎన్‌ఏవీపై పెట్టుబడి చేస్తుందని రెగ్యులేటర్ వివరించింది.