calender_icon.png 23 January, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదే తీరు.. మారరా మీరు?

26-08-2024 03:21:36 AM

  1. విధుల్లో నల్లగొండ ‘ఎంసీహెచ్’ నిర్లక్ష్య వైఖరి 
  2. గర్భిణికి ప్రసవం.. తల్లిగర్భంలోనే శిశువు మృతి 
  3. శిశువు మృతదేహంపై గాయాలు 
  4. వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు

నల్లగొండ, ఆగస్టు 25 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తున్నది. గర్భిణులకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో గర్భిణి నో లేదా.. నవజాత శిశువో ప్రాణాలు కో ల్పోవాల్సి వస్తున్నది. ఇదే ఆసుపత్రిలో 23న గర్భిణి కుర్చీలోనే ప్రసవించిన ఘటన మరువకముందే శనివారం రాత్రి నవజాత శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మాడుగులపల్లి మండలం గార్లకుంటపాలేనికి చెందిన చెరుకుపల్లి శ్రీల త మూడో కాన్పు కోసం ఈ నెల 23న నల్లగొండ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచ్చి ంది.

ఆమెకు ప్రసవం ఆలస్యం అవుతుందని వైద్యులు చెప్పారు. ఇదే రోజు దవాఖాన సి బ్బంది సకాలంలో వైద్య సాయం అందించకపోవడంతో కుర్చీలోనే ఓ గర్భిణి ప్రసవించి ంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వైద్యురాలుతోపాటు స్టాఫ్ నర్సులకు షోకాజ్‌లు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం వైద్య సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఇక వైద్యం అందడం కష్టమేనని భావించి సాయంత్రం ఇద్దరు గర్భిణులు దవాఖాన నుంచి ప్రైవేటు ఆససుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీలతను కూ డా కుటంబీకులు ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్తుండగా వైద్యురాలు స్వరూపారాణి వారిం చి అడ్డుకున్నారు.

తామే కాన్పు చేస్తామని ఎక్కడికీ వెళ్లవద్దని హామీ ఇచ్చారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో శ్రీలత ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సిజేరియ న్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో గర్భంలోనే మగ శిశువు మృతిచెందాడు. శిశువు ఒంటిపై అక్కడక్కడా గాయాలు ఉండడంతో గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని గర్భిణి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం వరకు దవాఖానలోనే ఉన్నారు.

పోలీసులు శిశువు మృతిపై విచారించారు. ఘటనపై వైద్యురాలు స్వరూపారాణిని వివరణ కోరగా.. ‘ఆపరేషన్‌కు ముందే స్కానింగ్‌లో శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని గుర్తించాం. గర్భిణికి కూడా స్వల్ప జ్వరం ఉంది. వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి వైద్యురాలు ఆపరేషన్ చేశారు. అప్పటికే గర్భంలోనే శిశువు మృతిచెందింది. చిన్నపిల్లల వైద్య నిపుణుడు వచ్చి శిశువుకు చెస్ట్ కంప్రెషన్, ఆక్సిజన్ బ్యాగెజ్ అండ్ మాస్కింగ్ చేసినా ఫలితం కనిపించలేదు. ఆపరేషన్ ఆలస్యమైతే తల్లి కూడా మృతి చెందేది’ అని తెలిపారు.