calender_icon.png 17 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌పై అదే రగడ

26-07-2024 03:36:46 AM

  1. పార్లమెంట్‌లో విపక్షాల నిరసన 
  2. రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్

న్యూఢిల్లీ, జూలై 25: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పార్లమెంట్‌లో వాడీవేడీ చర్చలు జరిగాయి. బడ్జెట్‌పై లోక్‌సభలో విపక్ష ఎంపీ లు తీవ్ర నిరసన వ్యక్తం చేయగా రాజ్యసభ సభ్యులు వాకౌట్ చేశారు. బడ్జెట్ సెషన్‌లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి రైల్వే ప్రమాదాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇండియా బార్డర్ వివాదంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయం లో విపక్ష పార్టీలు నినాదాలతో హోరెత్తించాయి.

విపక్షాల నిరసన నేపథ్యంలోనే పలు వురు కేంద్రమంత్రులు తమ సమాధాన పత్రాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. చర్చలో భాగంగా విమాన ధరలు ఆకస్మికం గా పెంచారని ఎంపీలు ఆరోపణలు చేయగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు సమాధానమిచ్చారు. నిబంధనల ప్రకారం ఈ ధరల విషయంలో ప్రభుత్వం నియంత్రించలేదని, అయినా ఈ విషయంలో దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. 

అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపట్టారు. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడటంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళననలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఎంపీ జయాబచ్చన్, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయి మాట్లాడుతూ.. చాలా రాష్ట్రా లు బడ్జెట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, కేవలం అధికారం కాపాడుకోవ డానికే ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రాల అవసరాలు పట్టించుకోలేదని, అందుకే ఇండియా కూటమి నిరసన తెలుపుతోందన్నారు.