బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటుతున్నారు. మొదటి మూడు రౌండ్లలో అటు ఓపెన్ కేటగిరీతో పాటు మహిళల కేటగిరీలో కూడా విజయం సాధించిన భారత ప్లేయర్లు నాలుగో రౌండ్లో కూడా సత్తా చాటుతున్నారు. ఓపెన్ కేటగిరీలో సెర్బియాతో, మహిళల కేటగిరీలో ఫ్రాన్స్‌తో తలపడుతోంది.
ఓపెన్ కేటగిరీ జట్టులో గుకేష్, ప్రజ్ఞానంద, అర్జున్, విదిత్ ఉండగా.. మహిళల కేటగిరీలో హారిక, వైశాలి, దివ్య, తానియా ఆడుతున్నారు. తెలంగాణకు చెందిన అర్జున్ నాలుగో రౌండ్‌లో 1 తేడాతో సెర్బియా గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండర్ మీద విజయం సాధించగా.. మరో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అలెక్సీతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇక మహిళల జట్టులో వైశాలి సోఫీతో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.