నిర్మల్ (విజయక్రాంతి): తల్లిదండ్రులు లేని ఓ అనాధ బాలుడిని సమత ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ బుధవారం దత్తత తీసుకున్నారు. దిల్వార్పూర్ మండలంలోని అంజన తాండ గ్రామం చెందిన మహేష్ అనే ఐదు సంవత్సరాల బాలుని దత్తత తీసుకున్నారు. మహేష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సమతా చైర్మన్ సుదర్శన్ ఆ బాలుడి చదువు ఖర్చులతో పాటు ఆరోగ్య ఖర్చులకు జీవితాంతం ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. బాలుని ప్రవేట్ పాఠశాలలో చదివిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు శ్రీనివాస్ ఫౌండేషన్ సభ్యులు క్రాంతి కుమార్, శేఖర్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.