calender_icon.png 23 February, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరిగా ఉండటం చాలా కష్టం

21-02-2025 12:00:00 AM

సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషన్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాను మూడు రోజుల పాటు ఫోన్‌కు దూరంగా ఉన్నానని తెలిపి సమంత నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఫోన్ లేనిదే క్షణం కూడా గడవదు. అలాంటి తరుణంలో ఫోన్ లేకుండా ఎలా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

“మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా.. ఎవరితోనూ ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా.. నాతో నేను మాత్రమే ఉన్నా. మనతో మనం ఒంటరిగా ఉండటం కష్టమైన విషయాల్లో ఒకటి. అలా ఉండటం భయంకరంగా ఉంటుంది. అయినా మౌనంగా ఉండేందుకు ఇష్టపడతా. మిలియన్ సార్లు అయినా సరే.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతా. మీరు కూడా అలా ప్రయత్నించండి” అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా ఓటీటీపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ ప్రాజెక్టు షూటింగ్‌లో జాయిన్ అయినట్టు సమంత తెలిపింది. ఆదిత్యరాయ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను రాహి అనిల్ బార్వే రూపొందిస్తున్నారు.