హైదరాబాద్,(విజయక్రాంతి): సినీనటి సమంత కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసఫ్ ప్రభు శుక్రవారం మృతి చెందాడు. తండ్రి మృతిపై భావోద్వేగ పోస్టును సమంత తన ఇన్ స్టాగ్రాం స్టోరీలో పోస్ట్ చేశారు. మళ్లీ జన్మలో మళ్లీ కలుద్దాం నాన్న అనే అర్థం వచ్చేలా, హార్ట్ బ్రోకెన్ సింబల్ పోస్ట్ చేసింది. కార్డియాక్ అరెస్ట్ తో జోసఫ్ ప్రభు కన్నుమూసినట్లు సమాచారం. దీనిని చూసిన పలువులు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.