19-04-2025 12:00:00 AM
ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం ‘శుభం’. యువ ప్రతిభావంతులతో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సిబుల్, హ్యూమర్‌తో అందరినీ పాత కాలానికి తీసుకువెళ్లేలా ఉందన్న అభిప్రాయం సినీప్రియుల్లో వ్యక్తమైంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు.
ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతోన్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “ట్రాలాలా మూ వింగ్ పిక్చర్స్ ద్వారా వినోదాన్ని అందించే చిత్రాలను రూపొందించడమే తన లక్ష్యం. ‘శుభం’ ఆ కోవలోకి చెందిన చిత్రమే అవుతుంది. ఈ సినిమా కోసం మా టీమ్ ఎంతో కష్టపడింది. ఈ ప్రత్యేకమైన కథను అందరితో పంచుకోవడానికి మేం సంతోషిస్తు న్నాం” అని పేర్కొన్నారు. వివేక్‌సాగర్ నేపథ్య సంగీతం సమకూర్చగా, క్లింటన్ సెరెజో పాటలకు బాణీలు సమకూర్చారు.