calender_icon.png 16 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమంత సొంత ప్రొడక్షన్ తొలిచిత్రం శుభం

16-03-2025 01:44:19 AM

ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్ ‘శుభం’. వసంత్ మరిగంటి రాసిన కథను ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. సీ మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ విజయవం తంగా పూర్తయ్యిందని చిత్రబృందం తాజాగా వెల్లడించింది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘ట్రాలాలా బ్యానర్‌పై ఈ సినిమాను తొలి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకు న్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుంది. థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. సినిమాటోగ్రాఫర్‌గా మదుల్ సుజిత్ సేన్, ఎడిటర్ గా ధర్మేంద్ర కాకర్లాడ్ పనిచేస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెం ట్‌తోపాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుందని సమాచారం. ఈ మూవీ అప్డేట్లు మరిన్ని మేకర్స్ త్వరలో ఇవ్వనున్నారు.