calender_icon.png 22 April, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమంత ఆ పోస్ట్‌కు లైక్ కొట్టింది!

22-04-2025 12:14:41 AM

‘జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యం పాలైతే పురుషుడు ఆమెను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో మహిళల తీరు భిన్నంగా ఉంది. భర్త ఆరోగ్యం బాగాలేకపోతే అతడ్ని విడిచిపెట్టాలనుకోవడం లేదు. తాజా సర్వే ప్రకారం ఇది నిరూపితమైంది. భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం భార్యతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడమే అని సర్వేలో తేలింది” అనేది ఓ పోస్ట్ సారాంశం. దీన్ని సుమారు 60 వేల మందికి పైగా నెటిజన్లు లైక్ చేశారు. ఈ పోస్ట్‌ను లైక్ కొట్టిన వాళ్లలో ఎవరెవరున్నారు అనే విషయం పక్కన పెడితే.. నటి సమంత ఈ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చకు దారి తీసింది.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన పలు సంఘటనల తర్వాత ఆరోగ్యం, ఆత్మస్థుర్యైం మహిళా సంరక్షణ వంటి విషయాలపై కొంతకాలంగా నెటిజన్లకు సందేశాలు ఇస్తున్నారు సమంత. అంతేకాదు బంధాల గురించి నెట్టింట ఏ పోస్టు వచ్చినా ఆమె లైక్ కొట్టడమో, షేర్ చేయడమో చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వైవాహిక వ్యవస్థ బలహీనం కావడంపై ఇటీవల సక్సెస్ వెర్స్ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు.

వైవాహిక బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని తేల్చిన సర్వే పోస్ట్‌ను సమంత లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత 2021లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత ఏడాది తాను మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్నట్టు ప్రకటించారు. సమంత ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ కోసం పనిచేస్తుండగా, తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో సమంత నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘శుభం’ మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది.